Saturday, March 21, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGovernment Land | వాటర్ ట్యాంక్‌ను కూల్చేసిన సోదరులు

Government Land | వాటర్ ట్యాంక్‌ను కూల్చేసిన సోదరులు

ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు దుశ్చర్య
దామరచర్ల మండలం బొత్తలపాలెంలో ఘటన
చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

మిర్యాలగూడ(ఆదాబ్ హైదరాబాద్): దామరచర్ల మండలం(Damaracharla Mandal) బొత్తలపాలెం(Botthalapalem)లో ప్రభుత్వ భూమి(Government Land) కబ్జాకు గురైంది. అధికార పార్టీ అండదండలతో(Ruling Party Support) ఆ సోదరులు ఈ ఘనకార్యం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

- Advertisement -

గ్రామంలో ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్‌(Mini Water Tank)ను నిందితులు గురువారం దర్జాగా కూల్చేశారు(Demolished). ఈ వాటర్ ట్యాంక్‌ను గతంలో కరువు నేపథ్యంలో తాగునీటి సరఫరా(Drinking Water Supply) కోసం సర్కారు సొమ్ముతో నిర్మించారు. గ్రామీణ నీటి సరఫరా సంస్థ(RWS) ఆధ్వర్యంలో సుమారు రూ.3 లక్షలతో అప్పట్లో అనేక గ్రామాల్లో ఇలా మినీ వాటర్ ట్యాంక్‌లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో బొత్తలపాలెంలోని ప్రధాన రహదారిపై గ్రామ పంచాయతీకి సమీపంలో మినీ వాటర్ ట్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చారు.

అనంతరం.. భూగర్భ జలాలు పెరగటంతో వాటర్ ట్యాంక్‌ను పెద్దగా వాడలేదు. దీంతో అది నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ జాగాపై కన్నేసిన సమీపంలోని ఓ ఇంటికి చెందిన సోదరులు వాటర్ ట్యాంక్‌ను ధ్వంసం చేసేందుకు గతంలో అనేక సార్లు ప్రయత్నించినట్లు సమాచారం. కానీ.. వారి పార్టీ అధికారంలో లేకపోవటంతో గ్రామస్తులు విజయవంతంగా అడ్డుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ గ్రామంలో అధికార పార్టీ మారటంతో కొందరు నాయకుల సపోర్ట్‌తో ఇష్టారాజ్యంగా ట్యాంక్‌ను ధ్వంసం చేశారు.

అయితే.. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి గానీ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గానీ ఏమీ పట్టనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ తాగునీటికి కరువు వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వాటర్ ట్యాంక్ ఉంటే, దానికి పైప్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది కదా అని సూచిస్తున్నారు. ప్రస్తుతం బొత్తలపాలెంలోని ఎస్సీ కాలనీలో ఇలాగే పాత వాటర్ ట్యాంక్‌లు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అందువల్ల.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు.. వాటర్ ట్యాంక్‌ను అక్రమంగా కూల్చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News