కరీంనగర్ పోలీస్ కమిషనరేట్(Karimnagar Commissionarate)లో అడ్మిన్ అండ్ ఎల్ఓగా పనిచేస్తున్న అడిషనల్ డీసీపీ పి.వెంకటరమణ(P.VENKATARAMANA)కు మరో ప్రతిష్టాత్మక పతకం లభించింది. సుదీర్ఘకాలంగా పోలీస్ విభాగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన ప్రభుత్వం తాజాగా మహోన్నత సేవా పతకాన్ని ప్రకటించింది. 1991లో ఎస్ఐగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన వెంకటరమణ ఇప్పటికే పలు పతకాలు అందుకున్నారు. 2009లో సేవా పతకం(SEVA PATHAKAM), 2015లో ఉత్తమ సేవా పతకం(Uttama Seva Pathakam), 2022లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అవార్డ్ (Best Investigator Award) స్వీకరించారు.
- Advertisement -
