Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD | సర్వం సిద్ధం

TTD | సర్వం సిద్ధం

  • తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
  • ఉత్తర ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
  • క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు
  • టోకెన్లు ఉన్నవారికే దర్శన భాగ్యం
  • మొట్టమొదటిసారి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం: టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి వెల్లడి

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి అన్నారు. ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ల కేటాయింపులో విధానాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. వైకుంఠ ద్వార దర్శన విధులకు వచ్చిన సిబ్బంది వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అధికారులతో అన్నారు.

భక్తుల భద్రత, రద్దీ నిర్వహణకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక ఏఐ సాంకేతికత వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ సాంకేతికత ద్వార భక్తులు, వాహనాల రద్దీపై ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. టీటీడీ, పోలీస్‌, విజిలెన్స్‌ విభాగాల నుండి ఐటీ నిపుణులు సమన్వయంతో పని చేస్తూ ఎప్పటికప్పుడు భక్తుల సమాచారాన్ని అప్డేట్‌ చేస్తూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌`1 లోని ఇంటిగ్రేటెడ్‌ ఏఐ కమాండ్‌ కంట్రోల సెంటర్‌ లో ప్రదర్శించాలని చెప్పారు. భవిష్యత్తులో తిరుమలకు వచ్చే భక్తుల కోసం సమస్య రహిత వ్యవస్థను నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి తెలిపారు.

- Advertisement -

క్యూలైన్లలో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్‌ వాటర్‌ డ్రమ్స్‌, మూడు మొబైల్‌ ఫుడ్‌ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించు కునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శంచుకోవాలని తెలియజేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్‌ 28 నుండి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌ లో భక్తులకు ఇచ్చే ªూఆ టోకెన్ల జారీని రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు. తొలి మూడు రోజులు అనగా, డిసెంబర్‌ 30, 31 మరియు జనవరి 01వ తేదీల్లో ఈ`డిప్‌ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.టోకెన్‌ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశిరచిన సమయానికి మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

వైకుంఠ ఏకాదశి నుంచి పదిరోజుల పాటు తిరుమలలో భక్తులకు ఏ ఇబ్బందులూ రాకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు తితిదే అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వెల్లడిరచారు. తొలిరోజు ప్రొటోకాల్‌ దర్శనాలు ముగిసిన వెంటనే స్లాటెడ్‌ సర్వదర్శనం మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి మంగళవారం రాత్రి 11:45 గంటల మధ్య.. 20 గంటల పాటు సామాన్యులకే అవకాశం కల్పిస్తాం. సుమారు 70వేల మందికి దర్శనం చేయించాలన్నది లక్ష్యం. ఏ రోజు టోకెన్‌ పొందితే, అదేరోజు దర్శనం చేయించేలా గంటలవారీగా లెక్కలు కట్టి అమలుచేస్తాం. ఇందుకోసం ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను వినియోగించనున్నాం. భక్తులు టోకెన్‌పై నిర్దేశిరచిన సమయానికి, సూచించిన ప్రదేశానికి రావాలి.

వేచి ఉండే భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం తదితర 16 రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నాం. మొదటి మూడు రోజులు 24 గంటలూ అన్నప్రసాదాలు, వేడి పానీయాలు కాఫీ, టీ, బాదం పాలు, చిన్నపిల్లలకు పాలు సిద్ధంగా ఉంటాయి. నిత్యం 4.30 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నాం. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు డిజిటల్‌ పేమెంట్‌ కియోస్క్‌లు ఏర్పాటుచేశాం. నగదురహితంగా స్లిప్పులు పొంది నేరుగా లడ్డూలు తీసుకోవచ్చు. పూర్తిగా ఆటోమేటెడ్‌ సిస్టమ్‌లో గదులు కేటాయిస్తున్నాం. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వెంకటాద్రి నిలయం (పీఎస్సీ`5)లో అద్భుత వసతులున్నాయి. భక్తులు గదుల కోసం వేచిచూడకుండా, ఇక్కడ స్నానాదులు ముగించుకుని తమ స్లాట్‌ ప్రకారం దర్శనానికి వెళ్తే మంచిదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News