Tuesday, February 10, 2026
HomeతెలంగాణKCR | అసెంబ్లీ కి చేరుకున్న కేసీఆర్ …

KCR | అసెంబ్లీ కి చేరుకున్న కేసీఆర్ …

  • ఆహ్వానం పలికిన పార్టీ విప్ కే పీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే లు..
  • సభలో మూడు నిమిషాలు కూడా లేని కేసీఆర్

అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్‌లో కూర్చున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్‌లోకి రాగానే వెళ్లి కరచాలనం చేశారు. సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్లి మంత్రుల కరచాలని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు, నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే సభకు వచ్చిన మూడు నిమిషాలకే కేసీఆర్ వెళ్లిపోయారు. కనీసం దివంగత సభ్యుల సంతాప తీర్మానం వినకుండా జాతీయ గీతం అవ్వగానే సభను వీడారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News