Tuesday, February 10, 2026
HomeతెలంగాణKTR | పథకాలను అడిగితే బూతులు తిడుతున్న సీఎం

KTR | పథకాలను అడిగితే బూతులు తిడుతున్న సీఎం

  • రేవంత్‌ ఫ్రస్ట్రేషన్‌ చూస్తే రేపో మాపో కరుస్తడేమో అని అనిపిస్తుంది..
  • రైతుబంధు పాలనపోయి రేవంత్‌ రాబందు పాలన వచ్చింది
  • బంగారంలాంటి రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి నాశనం చేస్తున్నాడు
  • నీకు దమ్ముంటే రైతులకుయూరియా దొరికేలా చేస్తానని శపథం చెయ్‌
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా

రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోసపడుతున్నారన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు పాలనపోయి రేవంత్‌ రాబందు పాలన వచ్చిందని అన్నారు. రైతులు చలిలో చెప్పులు క్యూలైన్‌లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డికి రైతుల పట్ల ప్రేమ లేదని అన్నారు. కేసీఆర్‌ హయాంలో యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని సర్పంచ్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అలవిగాని, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ కంటే అన్ని ఎక్కువిస్తామని ప్రజలను ఆశపెట్టారని చెప్పారు. రెండేళ్లు పూర్తయినా ఏమైనయ్‌ పథకాలను అడిగితే రేవంత్‌ రెడ్డి బూతులు తిడుతున్నాడని మండిపడ్డారు. మహాలక్ష్మీ పథకం ఏమైందంటే గుడ్లపీకి గోటీలాడతానంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు. రెండేళ్లలో 10 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని తెలిపారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.కాంగ్రెసోళ్లు పాలమూరు అంటేనే వలసల జిల్లాగా మార్చారని మండిపడ్డారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారని చెప్పారు. కేసీఆర్‌ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. వైకుంఠధామాలు కట్టామని.. డంప్‌ యార్డులు కట్టామని చెప్పారు.

- Advertisement -

దేశంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డులు 30 శాతం మనకే వచ్చేవి అని అన్నారు. ప్రతి గ్రామాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది కేసీఆర్‌ అని కొనియాడారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పడకేసిందని తెలిపారు. రేవంత్‌ పాలనలో ట్రాక్టర్లలో డీజిల్‌ లేదు.. వీధి లైట్లు లేవని అన్నారు.నేను ఆంధ్రాలో చదివితే నీకు నొప్పయితే.. నీ అల్లుడిది భీమవరం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి భీమవరం బుల్లెబ్బాయ్‌ పేరు సరిపోతుందని తెలి పారు. మా నాయన కేసీఆర్‌ 1984లోనే ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఎంఎస్‌ బయోటెక్నాలజీ, ఎంబీ ఏ చదివానని పేర్కొన్నారు.

మన ఇంట్లో మనం పనిచేసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. రేవంత్‌ ఎక్కడికి పోయినా ఆవు కథ లెక్క కేసీఆర్‌ మీద ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌ ఫ్రస్ట్రేషన్‌ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని అనిపిస్తుందని అన్నారు. రేవంత్‌ రెడ్డి నీకు దమ్ముంటే యూరియా బస్తాలు దొరికేలా చేస్తానని శపథం చెయ్‌ అని సవాలు విసిరారు. రూ. 4వేలు పెన్షన్‌ ఇస్తా అని శపథం చెయ్‌ అని అన్నారు. బంగారంలాంటి రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. గతంలో ఎట్లుండే నాగర్‌కర్నూలు ఇప్పుడు ఎలా తయారైందని ప్రశ్నించారు.

సర్పంచ్‌ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే రేవంత్‌కి సోయొచ్చింది

సర్పంచ్‌ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే సీఎం రేవంత్‌ రెడ్డికి సోయొచ్చిందని కేటీఆర్‌ అన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధివస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు సెమీ ఫైనల్‌ అని.. అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్‌ అని చెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా కారు గుర్తు మీద మాత్రమే ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు భయపడవద్దని సూచించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఏం చేయలేరని తెలిపారు. దేశంలో మీకు రక్షణగా ఉండేది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమని సర్పంచ్‌లకు కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బెదిరింపులు మిమ్మల్ని ఏం చేయలేవని స్పష్టం చేశారు.రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో.. గ్రామానికి సర్పంచ్‌ అట్లనే అని కేటీఆర్‌ తెలిపారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు సీదా గ్రామ పంచాయతీలకు వస్తాయని అన్నారు. ఐదంచెల ప్రభుత్వంలో అందరూ కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు.

సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ విధులు అందరూ తెలుసుకోవాలన్నారు. ఎక్కడ కాంగ్రెస్‌ ఉంటుందో.. అక్కడ ప్రోగ్రెస్‌ ఉండదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఇంకా రెండేళ్లే కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్లీ పచ్చబడతాయని.. గ్రామాలకు లక్ష్మీ కళ వస్తుందని అన్నారు.కాంగ్రెస్‌ సర్కార్‌ తీసుకొచ్చిన హిల్ట్‌ పాలసీపైనా కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఎకరం రూ.150 కోట్లకు చేరిందని కేటీఆర్‌ అన్నారు. ఆ భూములపై రేవంత్‌ రెడ్డి కన్ను పడిరదని తెలిపారు. హైదరాబాద్‌లో 9300 ఎకరాలపై రేవంత్‌ కన్నుపడిరదని అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయని చెప్పారు.

రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తక్కువ ధరకు భూములు ఇస్తామని వివరించారు. అలా పరిశ్రమలకు ఇచ్చిన భూముల్లో ఏదైనా కట్టుకోవచ్చని రేవంత్‌ రెడ్డి అంటున్నాడని మండిపడ్డారు. రూపాయికి 30 పైసలు కడితే ఏదైనా కట్టుకోవచ్చా అని నిలదీశారు. రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్‌ రెడ్డి హిల్ట్‌ పాలసీ తెచ్చిండని విమర్శించారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుకున్నది బీఆర్‌ఎస్‌ పార్టీ అని గుర్తుచేశారు. రేవంత్‌ రెడ్డి ఎంత దోపిడీ చేసినా బీజేపీ మాట్లాడదని అన్నారు.పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు గట్టిగా కొట్లాడి మరీ సత్తా చాటారని కేటీఆర్‌ అన్నారు. ఫిబ్రవిర మొదటి వారంలో పరిషత్‌ ఎన్నికలు వస్తాయని తెలిపారు. త్వరలో కేసీఆర్‌ బహిరంగ సభతో పాలమూరు ప్రజలను కలుస్తారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News