రుచికరమైన వంటలు చేయటంలో..
సాంబశివరావు దిట్ట అని పలువురి ప్రశంసలు
మహబూబాబాద్‌లో ఘనంగా జరిగిన..
బీఆర్ఎస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం
క్యాటరింగ్(Catering) విషయంలో ఖమ్మంలో మంచి పేరు సంపాదించిన వనమా సాంబశివరావు(Vanama Sambasiva Rao)ను బీఆర్ఎస్ పార్టీ(BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్(Working President) కేటీఆర్ అభినందించారు. ఎన్నో ఏళ్లుగా అన్ని శుభకార్యాలకు, సామాజిక వేడుకలకు తనదైన, ప్రత్యేక వంటలు చేసిన ఆయన అందరితో మన్నలు పొందుతున్నారు. శుభకార్యం ఏదైనా సరే మాకు మీ క్యాటరింగే కావాలి అని జనం చేత అనిపించుకుంటున్నారు. ఈ రోజు మహబూబాబాద్‌లోని పీఎస్‌ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి కూడా ఆయనే అద్భుతంగా వంటలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల పరిచయ, సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరూ సాంబశివరావు చేసిన రుచికరమైన వంటలను మెచ్చుకున్నారు.
కొత్తగా ఎన్నికైన గ్రామ ప్రజాప్రతినిధులకు మంచి విందు ఏర్పాటుచేయాలని భావించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత(Kavitha), పార్టీ లీడర్ మురళీరెడ్డి.. ఆ బాధ్యతను సాంబశివరావుకు అప్పగించారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన ఆ నేతల మాటను సాంబశివరావు నిలబెట్టుకున్నారు. విందు ఆరగించిన అందరూ భోజనాలు సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సర్పంచుల పరిచయ, సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కవిత, మురళీరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
