- పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
- 20మంది ముఠా సభ్యుల అరెస్ట్
- ఈ ముఠా నుంచి ఇద్దరు బాలలను కాపాడిన ఎస్వోటీ పోలీసులు
- ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల రూ.15 లక్షల లావాదేవీలు
చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డీసీపీ రితు రాజ్ విూడియా సమావేశంలో వెల్లడిరచారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు గుర్తించాం. సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని డీసీపీ తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 15 మంది పిల్లలను అమ్మిన ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో శిశువులను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని ఎనిమిది ఆస్పత్రులకు ఏజెంట్లగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి ఇద్దరు బాలలను ఎస్వోటీ పోలీసులు కాపాడారు. అంతే కాకుండా ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల 15 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడిరది.
