Wednesday, February 25, 2026
Homeనల్లగొండCustodial Death | కస్టడీలో మృతిపై విచారణకు ఆదేశం

Custodial Death | కస్టడీలో మృతిపై విచారణకు ఆదేశం

ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న..
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం
తదుపరి విచారణ జనవరి 12కి వాయిదా

సూర్యాపేట జిల్లా (Suryapet District) చిల్కూర్, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న చిత్రహింసల వల్లే కర్లా రాజేష్‌(Karla Rajesh) అనే రిమాండ్ ఖైదీ(Remand Prisoner) మృతిచెందాడనే ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం(Telangana State Human Rights Commission) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కర్లా రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించడం, కస్టడీలో హింసించడం వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంది.

- Advertisement -

మృతుడి తల్లి కర్లా లలిత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు (MRPS Founder President) మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga), మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఇతర సామాజిక కార్యకర్తలు చేసిన ఈ వాదనలపై కమిషన్ వెంటనే స్పందించింది. చిల్కూర్, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్లా రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ పద్ధతులతో హింసించి, తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించి, కుటుంబ సభ్యులను కలవనీయకుండా చేశారని, అనంతరం సబ్‌జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది.

మానవ హక్కుల ఉల్లంఘనల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇదే అంశానికి సంబంధించి ముందుగా నమోదైన ఎస్ఆర్ నంబర్ 3693/2025 ఫిర్యాదుతో ఈ కేసులను కలిపి విచారణ జరపాలని నిర్ణయించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని హోం శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎస్ఆర్ నంబర్ 4129 మరియు 4130/2025 కేసుల్లో తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News