Sunday, February 22, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐInternational Migrants Day | మెరుగైన అవకాశాల వేట.. వలస బాట..

International Migrants Day | మెరుగైన అవకాశాల వేట.. వలస బాట..

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్యసమితి(United Nations Organization) సర్వ ప్రతినిధి సభ 1990 డిసెంబర్‌ 18 నాటి సమావేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ కోసం తీర్మానాన్ని ఆమోదించింది. ఆ రోజు నుంచి ఏటా డిసెంబర్‌ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సవాళ్లు, సంఘర్షణలు, హింస లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ ఇళ్లను వదిలివెళ్తున్నారు.

2020 డేటా ప్రకారం 281 మిలియన్ల మందికి పైగా అంతర్జాతీయ వలసదారులు ఉన్నారు. సంక్షోభాల కారణంగా లక్షలాది మంది ఒక చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవుతున్నారు. అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలకు అవకాశాలు లేకపోవడంతో ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. ఆహార అలవాట్ల(Food Habits)లో మార్పులు, వాతావరణ పరిస్థితుల (Weather Conditions) వల్ల ఇబ్బందిపడుతున్నారు. పునరావాస లేమి (Lack of Rehabilitation) వల్ల ఈ సవాళ్లు మరింత తీవ్రతరమవుతున్నాయి.

- Advertisement -

స్వదేశాల్లో ఆర్థిక అస్థిరత.. చాలా మందిని విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో మెరుగైన అవకాశాలను వెతుక్కునేలా చేస్తోంది. తద్వారా వలసదారులు కార్మిక మార్కెట్‌(Labor Market)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నైపుణ్య అంతరాలను పూరిస్తున్నారు. కొన్ని ఆర్థిక వ్యవస్థలు వలస కార్మికులపైనే ఆధారపడుతున్నాయి. వలసదారులు తమ ఆతిథ్య దేశాల సాంస్కృతిక నిర్మాణాన్ని సుసంపన్నం చేసే విభిన్న దృక్పథాలను, సంప్రదాయాలను, నైపుణ్యాలను తీసుకొస్తారు.

ఈ వైవిధ్యం సృజనాత్మకతను, ఆవిష్కరణలను పెంపొందిస్తుంది. మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూరేలా చేస్తుంది. అందువల్ల ఆయా దేశాల ప్రభుత్వాలు వలసదారుల హక్కుల పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. మొబైల్ వైద్యశాల(Mobile Hospital) ద్వారా సేవలు అందించాలి. కనీస అవసరాలైన ఆహారం, తాత్కాలిక గుడారాలను అందుబాటులోకి తేవాలి. చిన్నారులకు విద్య అందించాలి. వారిలోని నైపుణ్యాన్ని గుర్తించి దేశానికి ఉపయోగకరంగా వాడుకోవాలి.

  • డాక్టర్ వై.సంజీవ కుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News