Sunday, February 22, 2026
HomeసినిమాPurushaha | ఇండస్ట్రీలోకి మరో పవన్ కళ్యాణ్

Purushaha | ఇండస్ట్రీలోకి మరో పవన్ కళ్యాణ్

పురుష: మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లడం, విడుదలకు ముందే హైప్ తీసుకురావటం మామూలు విషయం కాదు. కానీ ‘పురుష:’ మూవీ టీం మాత్రం కేవలం కాన్సెప్ట్ పోస్టర్లు(Concept Posters), ట్యాగ్ లైన్స్(Taglines), ఇంట్రడక్షన్ పోస్టర్ల(Introduction Posters)తోనే అందరినీ ఆకట్టుకుంటోంది. బత్తుల సరస్వతి (Bathula Saraswati) సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల (Pawan Kalyan Bathula) హీరో(Hero)గా పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇప్పటివరకు 3 ప్రధాన పాత్రల పోస్టర్లు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ వైష్ణవి కొక్కుర (Heroine Vaishnavi Kokkura) పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ (First Look Poster Release) చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అనేదానికి సింబాలిక్‌గా చూపించినట్లు అనిపిస్తోంది. ఇక పోస్టర్లో ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అనే డైలాగ్ చూస్తుంటే ఈ పాత్ర ఎలా ఉంటుందో చెప్పొచ్చు. మొత్తానికి ఒకరినొకరు అలా సీరియస్‌గా చూసుకుంటూ ఉండటాన్ని గమనిస్తే ఈ చిత్రంలో భార్యాభర్తల పోరు ఏ రేంజ్‌లో చూపిస్తారో ఊహించుకోవచ్చు.

పవన్ కళ్యాణ్‌తోపాటు ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి పాత్రలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని పోస్టర్లను చూస్తే తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంకా ఇతర పాత్రల పోస్టర్లు ఇంకెంతగా ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ మూవీలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News