- ప్రిన్సిపాల్ అరాచకంపై అగ్గి రాజేసిన ఫిర్యాదులు..
- నిబంధనలను గాలికొదిలిన ప్రభుత్వ కాలేజ్ బాస్..
- అటవీ శాఖ అధికారుల పాత్రపై అనుమానాలు..
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జై సూర్య పొట్టి శ్రీరాములు ప్రభుత్వ హెూమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పదవిని అలంకరించి కూర్చున్న వ్యక్తి, తన స్వార్థం కోసం, నిస్సిగ్గుగా పర్యావరణ వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారు. నిస్సహాయంగా రోగులకు, విద్యార్థులకు నీడనిచ్చిన వృక్షాలను నరికి, ఆ పవిత్ర ప్రాంగణంలో విద్యార్థులకు, రోగులకు నీడ లేకుండా చేశారు.. అరాచకానికి అడ్డాగా మార్చారు. అయితే, ఈ దౌర్జన్యం ఇక్కడితో ఆగలేదు. ఈ అక్రమానికి వత్తాసు పలికింది రాష్ట్ర అటవీ శాఖలోని కొందరు అధికారులు. మూడు పెద్ద చెట్ల నరికివేతకు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం లక్షల్లో ఉండాల్సిన జరిమానాను…
అమానుషంగా కేవలం నాలుగు వేల రూపాయలతో ముగించి, కేసును చల్లార్చడం వెనుక ఉన్న ‘బాగోతం’ ఏమిటి? ప్రిన్సిపాల్ అవినీతి గుంటలో అటవీ అధికారులు ఏ స్థాయిలో కూరుకుపోయారో ఈ ‘స్వల్ప’ జరిమానా బట్టబయలు చేస్తోంది. నిబంధనలను గాలికొదిలి, పర్యావరణ పరిరక్షణను అపహాస్యం చేసిన ఈ ప్రభుత్వ కాలేజ్ బాస్పై మరియు అతడికి వత్తాసు పలికిన అటవీ అధికారులపై, కళాశాలలో జరుగుతున్న అవినీతిపై పూర్తి వివరాలు మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది.
