Friday, February 13, 2026
Homeసాహిత్యంLove | ఆదర్శ ప్రేమ

Love | ఆదర్శ ప్రేమ

అందరికీ నమస్కారం అండీ.. నేను మీకు ఒక అందమైన మనసు ఉన్న అమ్మాయి కథను వినిపించాలని అనుకుంటున్నాను. ప్రేమ అనేది పైకి చెప్పి ఒప్పించుకొని కలిసి తిరిగేది కాదు మనసులో ముద్రించబడే ఒక భావం అని కూడా ఇందులో ఇమిడివున్న మరో అంశం
మధులిక చాలా మంచి అమ్మాయి. మంచి మనసుతో పాటు చాలా తెలివైన అమ్మాయి.చామని ఛాయా అయినా కనుముక్కు తీరు చాలా చక్కగా ఉంటుంది మధుకి.

దేవుడిచ్చిన అందంతో పాటు మధు కట్టూ బొట్టూ కూడా చాలా చక్కగా ఉంటాయి. మధు పల్లెటూరు నుండి ఒక గంట వ్యవధిలో కాలేజీ కి చేరుకునేది. ప్రతి రోజూ కూడా మధు బస్సు లో కాలేజీకి వెళ్ళేది. మధు చాలా మంచి గుణవంతురాలు. చాలా సౌమ్యంగా ఉండేది. అలాంటి అమ్మాయి తన స్నేహితులతో కలిసి రోజూ బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. మధు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తను రోజూ వెళ్లే దారిలోనే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉండేది. అందులో కోచ్ గా పనిచేసే అబ్బాయి పేరు రాధాకృష్ణ. రాధ కూడా చాలా మంచి అబ్బాయి.

- Advertisement -

హ్మ్మ..

మీకందరికీ అర్థం అయిందనుకుంటా…
మన ఈ చిన్ని అర్థవంతమంతమైన కథలో రాధాకృష్ణ హీరో అనమాట. మన మధులిక నే హీరోయిన్ అనమాట…

ఇక కథలోకి వస్తే రాధాకృష్ణ మంచివాడు తెలివైనవాడు. అతను చిన్న వయసులోనే చదువు పూర్తి చేసుకొని టీచింగ్ మీద ఇంట్రెస్ట్ కొద్ది ఆ ఇన్స్టిట్యూట్ లో కోచ్ గా జాయిన్ అయ్యాడు. రోజూ మన మధు ఇంటికెళ్లే సమయానికే రాధ కూడా బైక్ లో ఇంటికెళ్ళేవాడు. ఇకపోతే రాధ చాలా కలుపుగోలుగా అందరితో ఉంటాడు. కాకపోతే అతనికి పధ్ధతి గా ఉండే వాళ్లంటే చాలా గౌరవం. బయటకి ఒకలాగా ఉంటాడు కానీ లోపల మాత్రం చాలా రూల్స్ పెట్టుకొని జీవిస్తాడు.నాకు ఇది నచ్చదు అని ఎవర్నీ అనడు అలాగని ఎలా పడితే అలా ఉండే మనిషి కాదు. పైగా ఆడవాళ్ళ మీద ఎనలేని గౌరవం ఉండేది. అందర్నీ గౌరవించినట్టే ఉంటాడు కానీ అతనికి కొంచెం పధ్ధతిగా లేకున్నా నచ్చదు. అలా చాకచక్యం గల మనిషి మన హీరో. మధులిక తన స్నేహితురాళ్లతో కలిసి బస్టాప్ కి నడుచుకుంటూ వెళ్ళేది. ఆ దార్లోనే మన హీరో గారి ఇన్స్టిట్యూట్ కావడంతో రోజూ గమనించేవాడు మధు ని రాధ.

ఇకపోతే, మధు చాలా పద్దతిగా ఉండేది మరీ ఖరీదైనవి కాకపోయినా మంచి చుడీదార్స్ వేసుకునేది. చక్కగా జడ వేసుకొని, నుదుటన కుంకుమ పెట్టుకొని, చేతులకు మట్టి గాజులు వేసుకునేది. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి ఉండదు అలా ఉండేది. అచ్చతెలుగు అమ్మాయిలా, అన్ని పద్దతులు తెలిసిన అమ్మాయిలా ఉండేది. తన స్నేహితుల మధ్యలో తనని చూస్తే అందరికీ ఆకర్షణ ఉండదు కానీ మన రాధ లాంటి అబ్బాయిలకు మాత్రం తను దేవతలా కనిపించేలా ఉండేది. మధు స్నేహితులలో ఇద్దరు అమ్మాయిలకు రాధ బాగా తెలిసి ఉండేది. వాళ్ళు వెళ్ళేటప్పుడు రాధ కనిపిస్తే హాయ్ అని చెప్పేవాళ్ళు. రాధ వాళ్ళకి హాయ్ చెప్పేవాడు కానీ మధు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళేది. మధు చాలా ఆత్మాభిమానం కల అమ్మాయి పైగా కొత్తవాళ్లతో అస్సలు కల్పించుకొని మాట్లాడేది కాదు.

రాధ మాత్రం మధుని గమనించేవాడు ఆమె కట్టూ బొట్టూ చూసి ముగ్ధుడు అయ్యేవాడు. మరి కాకపోతే ఏం చేస్తాడు అలాంటి అపరంజి బొమ్మను చూసి సజాతి పురుషుడు ఎవ్వరూ మనసుపడకుండా ఆకర్షనకి గురి కాకుండా ఉండరు. ఇందులో నేను చెప్పదల్చుకున్నది ప్రేమ పుట్టే క్షణం చాలా గొప్పది అది పై పై మెరుగులు కాక సుగుణం చూసి పుట్టింది అనేది ఇక్కడ చెప్పే అంశం. పైగా గలగలా ఉండే అబ్బాయి అమాయకురాలిగా ఉన్న అమ్మాయిని మనసులో ముద్రించాడు అనేది గుర్తించదగ్గ అంశం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News