Tuesday, March 3, 2026
Homeకరీంనగర్Warning | పంచాయతీ ఎన్నికల్లో కబ్జాకోర్లకు గుణపాఠం చెప్పాలి

Warning | పంచాయతీ ఎన్నికల్లో కబ్జాకోర్లకు గుణపాఠం చెప్పాలి

  • ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పిలుపు

ప్రభుత్వ, ప్రైవేటు,అసైన్డ్ భూముల కబ్జాలతో గ్రామాల్లో అరాచకాలకు పాల్పడ్డోళ్లకు పంచాయితీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి, చెంజర్ల, పెద్దూరుపల్లి, గంగిపల్లి, కెల్లేడు, పోచంపల్లి,ఉటూర్,వేగురుప ల్లి, లక్ష్మిపూర్, వెల్ది,జగ్గయ్యపల్లి,శ్రీనివాస్ నగర్,రాఘవాపూర్,మానకొండూర్ గ్రామాల్లో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ సర్పంచులు గ్రామాల్లో అరాచకాలు సృష్టించారని, ప్రభుత్వ అసైన్డ్ భూములే కాకుండా ప్రైవేట్ భూములను కబ్జా చేసి అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వారిని మళ్లీ మనం ఎన్నుకుంటే అగచాట్లు తప్పవని ఆయన హెచ్చరించారు. కబ్జాకోరులను అవినీతిపరులను పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న వారిని సర్పంచులుగా వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని కవ్వంపల్లి కోరారు.

- Advertisement -

తొలి విడుత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వచ్చాయని, ఈ తీర్పుతో ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నట్టుగా తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు.తొలి విడుత తీర్పుతో ప్రజల విశ్వాసం చూరగొన్నాం తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజామోదం పొందామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. మలివడత పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్ వైపే ముగ్గు చూపుతారని ఆశాభవాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు నందగిరి కనకలక్ష్మీ- రవీంద్రాచారి (ముంజంపల్లి), గొల్లెన కనకమ్మ- కొమురయ్య, రామగిరి హరీష్(పెద్దూరుపల్లి),వాల అంజుత్ రావు(గంగిపల్లి), రాగుల లక్ష్మీ- కుమార్(కెల్లెడు), దాసరి శ్రీనివాస్ (పోచంపల్లి), వెలిశెట్టి కళ్యాణి -కిషోర్ (ఊటూర్), మందల మల్లారెడ్డి( వేగురవెల్లి), మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, పార్టీ నాయకులు శ్రీగిరి రంగారావు, బండి మల్లేశం, తాళ్లపల్లి సంపత్ గౌడ్, సాయిరి దేవయ్య, బొలబత్తుల ఆంజనేయులు, తమ్మిశెట్టి రాజేష్, కానిగంటి మల్లికార్జున్, రమేష్, ముక్కెర సతీష్ కుమార్, రామకృష్ణ, మాతంగి సహదేవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News