‘సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్’ పోస్టర్లను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వేడుకల వివరాలను సీఎంకు తెలిపిన మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్
ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల (Golden Jubilee) ప్రచార పోస్టర్ల(Posters)ను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆవిష్కరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి (Tdp Central Office) విచ్చేసిన సీఎంను న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ కలిశారు. అకాడమీ ఏర్పడి 50 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకొని సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ (Suroor e Urdu Mahotsav) పేరుతో నిర్వహిస్తున్న వారోత్సవాల వివరాలను మంత్రి ఫరూక్ సీఎంకు వివరించారు.
ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించి ఉర్దూ భాషాభివృద్ధి(Language Development)కి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించనున్నారు. ఉర్దూను ద్వితీయ భాషగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సర్కారు అమలుచేస్తున్న ప్రణాళికా బద్ధమైన చర్యలను ప్రజలకు వెల్లడించనున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు.. మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీకి సూచించారు.
