Thursday, March 26, 2026
Homeనల్లగొండPolling | ''నేడే" గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్.

Polling | ”నేడే” గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్.

  • తొలి విడత ఎన్నికల ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం.
  • 159 గ్రామపంచాయతీలు, 1442 వార్డుల్లో పోలింగ్.
  • 152 సర్పంచులు, 1244 వార్డులకు ఎన్నికలు.
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓటింగ్. 2 గంటలకు లెక్కింపు ప్రారంభం.
  • 264 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తింపు.
  • విధుల్లో 1683 మంది ప్రిసైడింగ్, 2260 మంది పోలింగ్ సిబ్బంది.

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతన 159 గ్రామపంచాయతీలు, 1442 వార్డులో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,ఇందులో 7 సర్పంచులు, 198 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని, 3 వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని, 152 సర్పంచులు,1244 వార్డులకు గురువారం పోలింగ్ జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న మండలాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను తనిఖీ చేసిన అనంతరం తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఎన్నికల డిఆర్సి కేంద్రంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని , మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడత ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. మొదటి విడత ఎన్నికలలో ఓటర్లందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకుగాను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులను ఏదో ఒక దాన్ని గుర్తింపుగా చూపించి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం గ్రామాలలో శాంతియుతగా, స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు.కాగా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 152 పోలింగ్ కేంద్రాలలో, 1244 వార్డులలో పోలింగ్ జరుగుతుండగా, స్టేజ్ వన్ ఆర్వోలుగా 52 మంది, స్టేజ్ టు ఆర్వోలుగా 178 మంది,16 ఎఫ్ ఎస్ టి బృందాలు, 28 మంది జోనల్ అధికారులు, 65 రూట్లు,1683 మంది ప్రిసైడింగ్ ,2260 ఇతర ప్రెసిడెంట్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. 264 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News