బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) ఏకగ్రీవంగా ఎన్నికైన (Unanimously Elected) సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. వేల్పూర్‌లోని ఆయన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. సర్పంచ్(Sarpanch)లను, ఉప సర్పంచ్(Vice Sarpanch)లను సన్మానించారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనవారు.. ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పెదకాపుల శ్రీనివాస్.. సర్పంచ్. వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నూతుల విజయ.. సర్పంచ్, నూతుల కృష్ణారెడ్డి.. ఉప సర్పంచ్. ఇదే మండలంలోని హనుమాన్ నగర్ గ్రామానికి చెందిన నడ్పి మల్లయ్య.. సర్పంచ్, ఉపసర్పంచ్.. మణి.
