ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా(Warangal District) నర్సంపేటలో రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల (Development Works)కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన (Foundation stone laying) చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు..
- రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు
- రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణం
- రూ.82.56 కోట్లతో హన్మకొండ–నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులు
- రూ.17.28 కోట్లతో నర్సంపేట-పాకాల రోడ్డు విస్తరణ పనులు
- రూ.56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ
- రూ.26 కోట్లతోప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణం
- రూ.20 కోట్లతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు
- Advertisement -
