క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీల్లో ప్రతిభ
49 ఈవెంట్లలో ఇప్పటివరకు 29 ఈవెంట్లు పూర్తి
తొలి రోజు పతకాల్లో త్రిపుర, సిక్కిం, ఏపీ, ఒడిశా రాష్ట్రాల హవా
శుక్రవారం తేలనున్న అన్ని విభాగాల తుది ఫలితాలు
శాస్త్రీయ సంగీతం, ఆశుకవిత్వం విభాగాల్లో ఏపీకి పసిడి
దేశభక్తి గ్రూప్ సాంగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం
22 పతకాలతో ఒడిషాకు తొలి స్థానం, 20 పతకాలతో తెలంగాణ (Telangana) రెండో స్థానం
మొత్తం 11 పతకాలు సాధించి ఐదో స్థానంలో ఉన్న ఆతిథ్య ఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థుల (Tribal Students) నైపుణ్యాల్ని వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉద్భవ్-2025 సాంస్కృతిక ఉత్సవాల్లో (Cultural Festivals) విద్యార్థులు ప్రతిభ (Talent) చాటుతున్నారు. కేఎల్ యూనివర్శిటీ(KL University)లో చిన్నారులు ప్రదర్శించే కళలతో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు నిర్వహించిన పోటీల ఫలితాల్లో త్రిపుర, సిక్కిం, ఏపీ(AndhraPradesh), ఒడిశా రాష్ట్రాల హవా సాగింది. రెండో రోజు నిర్వహించిన క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీల్లో విద్యార్థులు మెరిశారు. రెండో రోజు మొత్తం 22 విభాగాల్లో ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోటీలు నిర్వహించారు. ఇప్పటికే పలు విభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడించారు. రేపటితో అన్ని విభాగాలకు తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన వేదిక కృష్ణ జింక వద్ద జరుగుతున్న డ్రామా పోటీలను వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. జాస్మిన్ హాల్ వద్ద జరుగుతున్న శాస్త్రీయ సంగీత, నృత్య పోటీల వద్ద పండగ వాతావరణం నెలకొంది.
