Thursday, February 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Aids | నియంత్రణలో ఏపీకి తొలి స్థానం

Aids | నియంత్రణలో ఏపీకి తొలి స్థానం

అర్ధ సంవత్సర నివేదికలో న్యాకో!
33కు 25 ఇండికేటర్లలో అత్యుత్తమ ప్రతిభ
మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు

హెచ్ఐవీ (HIV) నియంత్రణ, బాధితులకు వైద్య సేవలు (Medical Services) అందించడంలో ఆంధ్రప్రదేశ్ (AndraPradesh) ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశంలోనే తొలిసారి ప్రథమ ర్యాంకు (First Rank) సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Health Minister Satyakumar) వెల్లడించారు.

- Advertisement -

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరుతో పోలిస్తే రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో నిర్దేశించిన ఇండికేటర్లలో అద్భుతమైన పనితీరు కనబరిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని ప్రకటించారు. 33 ఇండికేటర్ల (పనితీరు సూచికల)కు కేటాయించిన 138కి 105 మార్కులను ఏపీ సాధించిందని చెప్పారు. న్యాక్(National Control Organization) విడుదల చేసిన అర్థ సంవత్సర వార్షిక నివేదికలో పేర్కొన్న ర్యాంకింగ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు ముందుందని వెల్లడించారు.

ఇదే ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పనితీరు ప్రతిపాదికన న్యాక్ విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో ఏపీ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దీన్ని అధిగమిస్తూ తొలి స్థానంలో నిలిచేలా పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస అధికారులు, ఉద్యోగులను మంత్రి శ్రీ సత్యకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో అభినందించారు. ఇదేవిధంగా భవిష్యత్తులోనూ వ్యవహరించాలని వారిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News