Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌Power Projects | తెలంగాణకు రాజస్థాన్ ఆమోద పత్రాలు

Power Projects | తెలంగాణకు రాజస్థాన్ ఆమోద పత్రాలు

సింగరేణి(Singareni)తో కలిసి చేపట్టనున్న ప్రధాన విద్యుత్ ప్రాజెక్టులకు రాజస్థాన్ (Rajasthan) మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంబంధిత అధికారిక ఆమోదాన్ని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హిరాలాల్ నగర్ తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhattivikramarka)కు హైదరాబాద్‌లో అందజేశారు. ఈ ప్రాజెక్టులను తెలంగాణలోని సింగరేణి (SCCL), రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (RRVUNL) సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. వీటిలో 2,300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు(1,500 మెగావాట్ల సోలార్ + 800 మెగావాట్ల థర్మల్) ఉన్నాయి. ఇవి రెండు రాష్ట్రాల విద్యుత్ సరఫరా అవసరాలను గణనీయంగా తీరుస్తాయి. ఇది సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్-రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కావటం గమనార్హం. రాజస్థాన్, SCCL సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News