- ఎమ్మెల్యే కక్ష్యపూర్త రాజకీయాలు మానుకోవాలి.
- బిఆర్ఎస్ బలపరిచిన కర్రోళ స్వప్న గెలుపు ఖాయం.
- జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్..
బి ఆర్ ఎస్ బలపరిచిన కర్రోళ్ల స్వప్న గెలుపు ఖాయమని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గోపాల్ పేట మండల కేంద్రములో జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ కరుణశ్రీ, వైస్ ఛైర్మన్ కర్రీస్వామి, వెంకటేష్, సర్పంచ్ అభ్యర్థి స్వప్నతో కలసి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ.. గోపాల్ పేట మండలంలో ఇప్పటికే రెండు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు.
మండల కేంద్రంలో జనరల్ స్థానంలో దళిత మహిళ కర్రోల స్వప్న పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ దళితులపై చిన్న చూపు చూస్తుందని ఇదేనా దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. స్వప్నకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఆమె భర్త భాస్కర్ ను కుంటి సాకులు చూపుతూ ఉద్యోగం నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఎన్నికలు పూర్తి అయ్యేవరకు గోపాల్ పేటలో ఉండరాదని నిబంధన పెట్టడం ఎమ్మెల్యే చర్యలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన జనరల్ స్థానంలో దళిత మహిళను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని గోపాల్ పేట ప్రజలకు పిలుపు ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి స్వప్న మాట్లాడుతూ.. మాపై ఎమ్మెల్యే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని నా భర్తపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు, మాజీ వైస్ ఎంపిపి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, గంధం పరంజ్యోతి, బాల్ చంద్రయ్య, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఇమ్రాన్, మంద.రాము, అనపటి రాము, నందిమల్ల సుబ్బు తదితరులు ఉన్నారు.
