విద్య, వ్యవసాయంలో అగ్రగామిగా నిలుపుతాం..
కేసులకు భయపడం సోనియా, రాహుల్లకు అండగా మనమంతా ఉన్నాం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అంతిమ లక్ష్యం.. పీసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి
- ఖమ్మం జిల్లా అభివృద్ధి బాధ్యత నాది..
- తెలంగాణ ఏర్పాటుకు పునాది పడిరది ఇక్కడే
- తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ పేరుతో ఎర్త్ వర్సిటీ
- సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం
- ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే ఆదర్శం
- గ్రామాల్లో మంచి సర్పంచ్‌నే ఎన్నుకోండి
- మంత్రులతో కలిసి పనిచేసే వారినే ఆదరించండి
- ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సంలో రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంతో పాటు వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని అందులో భాగంగానే విద్యా, వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా అన్ని విద్యాబోధనలు ఒకే చోట అందించే ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్న కాకతీయ కాలేజ్ ఆఫ్ మైన్స్ (ఎఎస్‌ఎం) కళాశాలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈసందర్భంగా మంగళవారం యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తొలి తెలంగాణ ఉద్యమానికి పునాది పడిరది పాల్వంచలోని థర్మల్ పవర్‌స్టేషన్ (కెటిపిఎస్) నుంచేనని ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
2004 నుంచి 2014 వరకు ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ దేశ అభివృద్ధికి ఎన్నో పునాదులు వేశారని, అటువంటి మేధావి పేరును కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కళాశాలకు పెట్టుకోవడం అధృష్టమన్నారు. అన్ని విద్యాబోధనలను విద్యార్థులు ఒకే చోట అభ్యసించాలన్న సదుద్ధేశ్యంతో, విద్యాభివృద్ధికి పునాదులు వేసేందుకు ఈ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు.ఈకళాశాల దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం అనేక ప్రణాళికలను సిద్ధం చేశామని ఆదిశగా అభివృద్ధి ఫలాలను విద్యార్థులకు అందించేందుకు ముందుకు సాగుతున్నామన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ప్రభుత్వానికి, పాలనకు ఆయువుపట్టని రాష్ట్రప్రభుత్వం ఏపథకం ప్రారంభించినా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం చేస్తున్నామని రాష్ట్ర అభివృద్ధిలో ఈ త్రిమూర్తులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఆకలి కేకలు లేకుండా మనవంతు కృషిగా వ్యవసాయ రంగాన్ని దివంగత మాజీప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్పూర్తితో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆనాడు శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టులతో పాటు అనేక డ్యాంలను నిర్మింపచేసిన నెహ్రు రాష్ట్రంతో పాటు దేశానికే ఆదర్శమన్నారు.

వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతపది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోలేదని, వ్యవసాయ భూములు బీడు భూములుగా మారాయని, రైతుల కళ్లల్లో కన్నీటి చుక్కలు కారుతుంటే కెసిఆర్ ఇంట్లో మాత్రం కాసుల వర్షం కురిసిందన్నారు. భద్రాద్రి రామయ్య సాక్షిగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ అటు గోదావరి జలాలతోపాటు కృష్ణాజలాలు పారుతున్నాయని, ఆ జలాలతో బీడు భూములను పంట భూములగా మారుస్తామని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉందని సింగరేణి సంస్థతోపాటు పాల్వంచ కెటిపిఎస్‌తో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అటువంటి ప్రభుత్వానికి పల్లెలు పట్టుకొమ్మలని రాష్ట్రంతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్‌లు సైతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలని అప్పుడే రాష్ట్రం, పల్లెలు సస్యశ్యామలంగా, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఈసందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
జ్ఞానాన్ని అందించే విద్యాలయంకు తొలి అడుగు : డిప్యూటీ సిఎం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్‌సైస్సెన్ యూనివర్సిటీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుందని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విద్యాలయంకు నేడు తొలి అడుగు వేస్తున్నట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. భూమి పరిసరాలు, భూమిలోపల ఉన్న ఖనిజాల గురించి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయని దేశానికే దిక్సూచిగా తెలంగాణరాష్ట్రం నిలుస్తుందన్నారు. యూనివర్సిటీకి అవసరమైన వసతులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.
దేశానికే తలమానికం ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీ : తుమ్మల
దేశానికే తలమానింగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరుమీద కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో వినూత్న విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటాయించినందుకు ప్రజల తరపున సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం జిల్లాకు గోదావరి జలాలు, విద్యుత్‌కేంద్రం రావాలని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు అదనంగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నారు.
మన్మోహన్‌సింగ్ పేరిట యూనివర్సిటీ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు : పొంగులేటి
తెలంగాణరాష్ట్రం ఏర్పాటు చేసిన ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరుతో ఎర్త్‌సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరున ఒక్క పథకం పేరు పెట్టకపోవడం గత పాలకుల దుర్భుద్ధికి నిదర్శనమన్నారు.ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినప్రతి హామీ అమలు చేస్తున్నామని, ప్రజలు పనిచేస్తున్న ప్రజాప్రభుత్వానికి ఆశీర్వాదాలు అందించాలన్నారు.
నియోజకవర్గంపై ప్రత్యేక ప్రేమతో కృషి : ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం నియోజకవర్గంపై ప్రత్యేకమైన పేరుతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఈప్రాంతానికి ఇచ్చినందుకు సిఎంకి కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, 800 మెగావాట్ల విద్యుత్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం లభించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు విద్యాచందన, వేణుగోపాల్, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లంవెంకట్రావు, కార్పోరేషన్ ఛైర్మన్లు,ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారులు, ఆర్డీఓ మధు, ప్రిన్సిపల్ జగన్మోహన్‌రాజు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
