కేంద్ర ప్రభుత్వం కీలకమైన పేర్లను మార్చింది. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) పేరును ఇక మీదట ‘సేవా తీర్థ్’(Seva Teerth)గా పేర్కొంటారు. రాష్ట్రాల్లో గవర్నర్ల అధికారిక నివాసాల పేరు ‘రాజ్‌భవన్’(Raj Bhavan)ను మార్చి ‘లోక్‌భవన్’(Lok Bhavan)గా నామకరణం చేశారు. వలసవాదానికి గుర్తుగా ఉండటంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సౌత్ బ్లాక్ నుంచి కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ చేయనున్నారు.
ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదలైంది. సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఆఫీసులను మారుస్తారు. ఇక నుంచి న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి తరలిస్తారు. ప్రధానమంత్రి కార్యాలయాన్నీ అక్కడే ఏర్పాటుచేస్తారు. సేవాతీర్థ్-2లో మంత్రివర్గ సచివాలయం(Cabinet Secretariat), సేవాతీర్థ్-3లో జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) కార్యాలయం పనిచేస్తాయి.
