Tuesday, March 3, 2026
Homeమహబూబ్‌నగర్‌Awareness | పోలీసులు మాత్రమే రక్షకులు కాదు..

Awareness | పోలీసులు మాత్రమే రక్షకులు కాదు..

  • అవగాహన కలిగిన ప్రతి పౌరుడు రక్షకుడే.
  • ధైర్యంగా “నో “చెప్పగలిగిన విద్యార్థి ఎలాంటి సైబర్ దాడినైనా ఎదుర్కోగలడు.
  • జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి..

సైబర్ నేరాలపై పోలీసులు మాత్రమే రక్షకులు కాదని అవగాహన కలిగిన ప్రతి పౌరుడు రక్షకుడు అని జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్బి) ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కలిగించేందుకు “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో ప్రత్యేక ఆరు వారాల ప్రచార కార్యక్రమాన్ని డిసెంబర్ 2, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం నీ వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ భవనంలో ప్రభుత్వ వైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ, ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మరియు బాలుర జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో ఏర్పాటుచేసిన “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ ప్రారంభించారు.

ఈ అవగాహన లో పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు, ప్రజా స్థలాలు వంటి వి భాగస్వాములవుతాయని అన్నారు. ఈ సందర్భంగా యువత విద్యార్థుల్లో డిజిటల్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులతో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్ ప్రపంచంలో మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని అవగాహన నే.. ఆయుధంగా మలుచుకుని తన కుటుంబాన్ని రక్షించే సైబర్ వారియర్ అవ్వాలని విద్యార్థి, విద్యార్థులకు సూచించారు. ఎవరికైనా మోసం జరిగితే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని, సైబర్ భద్రతపై ప్రభుత్వం, పోలీసులు, ప్రజలందరి భాగస్వామ్యంతో కలిసికట్టుగా సైబర్ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఆరు వారాలపాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వారాని కొక్క పోలీస్ స్టేషన్ టి జి సి ఎస్ బి అందించే పోస్టర్లు ఆడియో, వీడియో క్లిప్పులను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి బాలాజీ నాయక్, సీఐ లు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్సై రవి ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News