Tuesday, March 3, 2026
Homeమహబూబ్‌నగర్‌Development | అభివృద్ధి అంటేనే కేసీఆర్..

Development | అభివృద్ధి అంటేనే కేసీఆర్..

  • బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు.
  • మాజీమంత్రి నిరంజన్ రెడ్డి..

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో మాజీ జిల్లా రైతు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం లో కాంగ్రెస్ పార్టీ నుండి స్వాతి, హరికుమార్ రెడ్డి, మాధవి రెడ్డి తో పాటు 200 మంది, అంకాయ పల్లి తండా నుండి మోత్య నాయక్, చంద్రు, బుచ్చన్న, నాగరాజుతో పాటు వందమంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వారికి కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.

అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే కేసీఆర్ అని, పదేళ్ల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగారని కొనియాడారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతిపాలై అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నన్ను నమ్మి కెసిఆర్ పై నమ్మకంతో పార్టీలోకి వస్తున్న అందరికీ సముచిత స్థానం కల్పించి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News