Tuesday, March 3, 2026
Homeఆరోగ్యంChiranjeevi | ‘చిరంజీవి’ విజ్ఞప్తి.. కేంద్రం అనుమతి..

Chiranjeevi | ‘చిరంజీవి’ విజ్ఞప్తి.. కేంద్రం అనుమతి..

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. తమకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(Foreign Contribution Regulation Act: FCRA)-2010 కింద నమోదుకు వీలు కల్పించాలని కోరగా కేంద్ర హోం శాఖ (Union Home Ministry) గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ప్రముఖ నటుడు చిరంజీవి ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇకపై ఇతర దేశాల నుంచి డొనేషన్లు (Donations) స్వీకరించటానికి అవకాశం దక్కింది.

ట్రస్ట్‌లో భాగంగా బ్లడ్ బ్యాంక్(Blood Bank), ఐ బ్యాంక్ (Eye Bank) ద్వారా మెగాస్టార్ (Megastar) చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలను (Social Service Programs) నిర్వహిస్తున్నారు. అయితే.. ఇటీవల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల వాటికి అనుగుణంగా పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయటంతో కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News