Tuesday, March 24, 2026
HomeజాతీయంAccident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

  • రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఆరుగురు దుర్మరణం
  • మృతుల కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెనకాశీ-మదురై రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మదురై నుంచి సెన్కొట్టాయ్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. తెన్కాశీ నుంచి వస్తోన్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికి రెండు బస్సులు తీవ్రంగా ధ్వంసమ య్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికం గా నిర్ధరించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్లను సేకరిస్తున్నామని తెలిపారు. ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

స్పందించిన సీఎం

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై స్పందించారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News