Friday, March 13, 2026
Homeఆజ్ కీ బాత్Youth | యువతకు కాదేదీ అసాధ్యం

Youth | యువతకు కాదేదీ అసాధ్యం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రానే వచ్చే. గ్రామం(Village)లో ఉండే యువతకు సువర్ణ అవకాశం (golden opportunity) కళ్ల ముందుకు వచ్చే. గెలుపు ఓటములు పక్కనపెట్టి ఎన్నికల్లో పోటీ (Contest) చెయ్యండి. ప్రస్తుత రాజకీయాల్లో (Politics) మార్పు (Change) తెచ్చేందుకు యువత రాజకీయాల్లోకి రావాలి. మీ గ్రామ అభివృద్ధి మీపైనే ఆధారపడి ఉంది. నాకెందుకులే అనుకుంటే ఐదేళ్లు మళ్లీ తిప్పలు తప్పవు.

రాజకీయ పార్టీలకు బలం చేకూర్చేదే యువకులు. అలాంటి యువకులకు ఏ పార్టీ స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందో చూడాలి. స్వతంత్ర అభ్యర్థి(Independent candidate)గా లేదా రాజకీయ పార్టీ మద్దతుతో పోటీచేస్తావా అనేది నీ ఆలోచన. పోటీకి సుక్క ముక్క నోటు లేకున్నా బ్యాలెట్ పేపర్‌(Ballot Paper)లో పేరు ఉండాలి. ఎదురుగా ఎవరున్నారు అనే ఆలోచన వద్దు. యువకులందరూ ఏకం కావాలి. గ్రామ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. యువకులు తలుచుకుంటే సాధ్యం కానిదేదిలేదు.

  • శ్రావణ్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News