Tuesday, March 10, 2026
Homeఆదిలాబాద్Good News to Kagaznagar | కాగజ్‌నగర్ పట్టణవాసులకు శుభవార్త

Good News to Kagaznagar | కాగజ్‌నగర్ పట్టణవాసులకు శుభవార్త

కాగజ్‌నగర్ మునిసిపాలిటీ(Municipality)లో తాగునీటి సరఫరా (Drinking Water Supply) కోసం రూ.31.50 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు (Central Government Funds) మంజూరయ్యాయి. పట్టణాభివృద్ధి కోసం ఇదివరకు అర్బన్ ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) కింద మంజూరు చేసిన రూ.18.70 కోట్ల నిధులకు ఇవి అదనం. 2 పద్దుల కింద రూ.50.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను గతంలో కోరినట్లు సిర్పూర్ ఎమ్మెల్యే (Sirpur Mla) పాల్వాయి హరీష్ (Palvai Harish) పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం స్పందించి UIDF పథకం కింద ఈ నిధులను మంజూరుచేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (NHB) ఇచ్చిన ఈ నిధులతో పట్టణంలో తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో 3 ఓవర్ హెడ్ ట్యాంక్లు, అండర్ గ్రౌండ్ పైపులైన్ విస్తరణ పనులు చేపడతామని చెప్పారు. ఇప్పటికే పట్టణంలో 5 ఓవర్ హెడ్ ట్యాంక్ల ద్వారా పట్టణవాసులకు నిత్యం 8 వేల కిలో లీటర్ల నీటిని అందిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం మంజూరైన నిధులతో మరో 3 ట్యాంక్లు (500 కెఎల్ (2), 800 కెఎల్ (1)) నిర్మాణం చేపడితే వీటి ద్వారా అదనంగా 1800 కిలో లీటర్ల నీటిని పట్టణవానులకు అందించేందుకు అవకాశం ఉంది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News