జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla)గా విజయం సాధించిన నవీన్ యాదవ్(Naveen Yadav) ఈ రోజు గ్యార్మీ వేడుక(Garmi Celebration)లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు (Special Prayers) చేశారు. శ్రీకృష్ణనగర్‌లోని మజీద్-ఏ-జహూర్-ఏ-కరీమి.. మజీద్ మైనార్టీ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూఫీ ఆధ్యాత్మిక గురువు (Sufi spiritual teacher) హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ జ్ఞాపకార్థం ఈ పండుగను జరుపుకుంటారు. నవీన్ యాదవ్‌తోపాటు మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ కూడా హాజరయ్యారు.

శుభాకాంక్షలు
ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్నట్లు నవీన్ యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరులకు గ్యార్మీ పండుగ శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు ఫారిద్, హుస్మాన్, పైజ్, షానావాజ్, మై తదితరులు పాల్గొన్నారు.

పండుగ ముఖ్య ఉద్దేశాలు..
పాప ప్రక్షాళన, ఆధ్యాత్మిక చింతనను ప్రోత్సహించడం, ఐకమత్యాన్ని (Unity) పెంచడం.
