జూబ్లీహిల్స్ (JubileeHills) ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ నిత్యం పలువురు మంత్రులను, ప్రముఖులను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల(Senior Leaders)ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. తన విజయం కోసం పాటుపడ్డ ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నారు. అదే సమయంలో వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
ఝాన్సీరెడ్డితో భేటీ..
ఇవాళ శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి(Jhansi Reddy)ని కలిశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు ఆమె హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. ఝాన్సీరెడ్డి సూచనలు, సలహాలతో జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు తీర్చడానికి, ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని నవీన్ యాదవ్ అన్నారు.

మంత్రి వెంకట్‌రెడ్డితో..
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy)తో మర్యాదపూర్వకంగా భేటీ అయి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందించే దిశగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
విజయశాంతితో సమావేశం..
నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ (MLC) విజయశాంతి(Vijayashanti)ని కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేయాలని విజయశాంతి సూచించారు. విజయశాంతి అనుభవం, మార్గనిర్దేశం ఎంతో ఉపయోగకరమని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.

రోహిన్‌రెడ్డితో మీటింగ్
నవీన్ యాదవ్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు C.రోహిన్ రెడ్డి(Rohin Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి.. నవీన్ యాదవ్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాలనీల అభివృద్ధి వంటి అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

