మహిళా క్రికెటర్ (Women Cricketer) స్మృతి మంధాన.. మ్యూజిక్ కంపోజర్ (Music Composer) పలాష్ ముచ్చల్(Palash Muchhal)ను వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే వీరి పెళ్లి ఏర్పాట్లు (Marriage Arrangements) ఊపందుకున్నాయి. ఇండోర్(Indore)లోని ముచ్చల్ ఇంటిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు(Decorate). ఈ జంట 2019 నుంచి డేటింగ్(Dating)లో ఉంది. 2024 జులైలో తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. స్మృతి మంధాన.. ఇండోర్ కోడలు కాబోతోందంటూ ముచ్చల్.. 2025 అక్టోబర్‌లో ప్రకటించాడు. దీంతో ఇప్పటికే వీరి శుభలేఖలు వైరల్ అయ్యాయి. వివాహ వేదికను ఇంకా ధ్రువీకరించలేదు. కానీ.. మహారాష్ట్రలోని స్మృతి సొంత పట్టణం సింగ్లిలో జరగొచ్చని భావిస్తున్నారు. పెళ్లి వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభంకానున్నాయి.
Smriti Mandhana | పెళ్లి సందడి ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES
