Wednesday, February 11, 2026
Homeమెదక్‌Inspection | ఆర్డీఓ మహిపాల్ రెడ్డి కీలక ఆదేశాలు..

Inspection | ఆర్డీఓ మహిపాల్ రెడ్డి కీలక ఆదేశాలు..

  • చిలిపిచేడ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..

చిలిపిచేడ్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లను,జరుగుతున్న ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.తాలు,తేమ లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.

ధాన్యం తూకం వేసిన తర్వాత,సంచుల రవాణా కోసం తగినన్ని వాహనాలను సిద్ధంగా ఉంచాలని రవాణా కాంట్రాక్టర్లకు సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం,నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయడం,వంటి విషయాలను,తేమ శాతం,నాణ్యత విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని,రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేశారు.

- Advertisement -

కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే లేదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని,ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర పొందాలని కోరారు.రైతులు కూడా సహకరించాలని,నాణ్యమైన,ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని కోరారు.17 శాతం తేమకు మించకుండా చూసుకోవాలని పలు సూచన చేశారు.ఈయన వెంట ఎమ్మార్వో సహదేవ్,ఆర్ఐ సునీల్ చౌహాన్,సొసైటీ సీఈఓ పోచయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News