ఫార్ములా ఇ-కార్ రేసింగ్ (Formula E-Car Racing) కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ (Brs Party Working President) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)పై అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణకు గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma) అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే చాలా సార్లు కేటీఆర్‌ను విచారణ జరిపింది. ఇందులో రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రాగా ఇదొక లొట్టపీసు కేసు అని, నిలబడేది కాదని కేటీఆర్ సైతం పలుమార్లు స్పందించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్(Prosecution)కు అనుమతి కావాలని కోరుతూ ఏసీబీ గతంలో గవర్నర్‌కు లెటర్ రాసి.. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు పర్మిషన్ ఇస్తూ గవర్నర్ జీవో జారీ చేశారు. దీంతో.. త్వరలోనే అభియోగపత్రాలను (Chargesheet) దాఖలుచేయనున్నారు.
