ఇబ్రహీంపట్నం నియోజకవర్గం (Ibrahimpatnam Constituency) తుర్కయంజాల్ మునిసిపాలిటీ (Turkaymanzal Municipality) ఇంజాపూర్(Injapur)లోని వెంకటేశ్వర కాలనీ నూతన అధ్యక్షుడి(President)గా స్థానిక నాయకుడు రావులకోల్ నరేష్ ప్రజాపతి (Ravulakol Naresh Prajapati) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాలనీ సమస్యలను గుర్తించి పరిష్కారానికి పాటుపడతానని చెప్పారు.
కాలనీ పెద్దల ఆశీర్వాదం, ప్రభుత్వ పెద్దల, అధికారుల సమన్వయంతో వెంకటేశ్వర కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కాలనీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దుడుకు పాండు, కోశాధికారిగా జటావత్ హరినాయక్, గౌరవ అధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్, ధర్మారావు, న్యాయ సలహాదారుడిగా కొంపల్లి సాంబశివుడు, మాజీ అధ్యక్షుడు బోరం వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
