Saturday, March 7, 2026
HomeతెలంగాణVice President | ఉపరాష్ట్రపతికి తేనీటి విందు

Vice President | ఉపరాష్ట్రపతికి తేనీటి విందు

హైదరాబాద్ పర్యటన(Hyderabad Tour)కు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) గౌరవార్థం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు(Tea party)లో సీఎం రేవంత్ (CM Revanth) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిని సత్కరించారు. రాజ్ భవన్‌(Raj Bhavan)లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(KishanReddy), మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కి బేగంపేట విమానాశ్రయంలో సీఎం రేవంత్ సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News