Homeనల్లగొండSuryapet | సూర్యాపేట కాంగ్రెస్ నేతల సంబరాలు

Suryapet | సూర్యాపేట కాంగ్రెస్ నేతల సంబరాలు

సూర్యాపేట, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Electin)లో కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) భారీ మెజారిటీతో విజయం (Victory) సాధించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో (Red House) పార్టీ నాయకులు విజయోత్సవాలు (Celebratins) నిర్వహించారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు (Sweets) పంచుకుని నాయకులు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ హాజరయ్యారు.

WhatsApp Image 2025 11 14 at 21.50.51

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ విజయానికి ప్రతిబింబమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో కేటీఆర్ ‘హైడ్రా’ పేరుతో భయపెట్టే ప్రయత్నం చేసినా, ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని అన్నారు. జూబ్లీహిల్స్ విజయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శుభసూచకమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News