Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGovernment Lands | ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

Government Lands | ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

  • సర్వే నెంబర్ 817లో జోరుగా అక్రమ నిర్మాణాలు
  • అధికారుల కనుసన్నల్లోనే అక్రమ కట్టడాలా…?
    భూ భారతిలో కూడా భూములకు రక్షణ కరువు

పాల్వంచ, నవంబర్ 13 (ఆదాబ్ హైదరాబాద్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం.. ఇప్పుడు కార్పొరేషన్‌గా ఏర్పడింది. కార్పొరేషన్ పరిధిలోకి పాల్వంచ మున్సిపాల్టీ(Palvancha Municipality)ని కూడా విలీనం చేశారు. దీనికి తోడు పాల్వంచ సమీపంలో కెఎన్ఎం వద్ద కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. దీంతో పాల్వంచ పట్టణ భూములకు చెక్కులు రావడంతో ప్రభుత్వ భూములు సైతం కబ్జాలకు గురవుతున్నాయి. కొంత మంది ఆక్రమణదారులు యథేచ్ఛగా కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు.

తప్పుడు ధృవపత్రాలు (Fake Documents) సృష్టిస్తూ వాటిని విక్రయిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని పట్టణ ప్రజలు (Town People) ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం భూభారతి (BhuBharati) చట్టాన్ని ప్రవేశపెట్టి ఎక్కడా అవినీతి ఆక్రమాలు జరగకుండా ప్రభుత్వ ప్రైవేట్, వ్యవసాయ భూముల అన్ని విభజన చేయడం జరుగుతుందని చట్టంలో వెల్లడించారు. అయితే భూభారతి చట్టం వచ్చినా కాని ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేదవాడు చిన్న గుడిసె కడితే వెంటనే వచ్చి కూల్చివేసే అధికారులు కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న విషయం అధికారులకు తెలియడా, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణ దారులకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని అధికారుల తీరుపై పట్టణప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అధికారుల కనుసన్నల్లోనే అక్రమ కట్టడాలా…?

సొంత జాగా లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదో తలదాచుకోవడానికి పేదవాడు చిన్న గుడిసె వేసుకుంటునే పని గట్టుకొని కూల్చివేసే అధికార యంత్రాంగం.. ఉన్నవాడు ఎకరాలకు ఎకరాలు ఆక్రమిస్తే పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పాల్వంచ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని 817 సర్వే నంబర్ అసైన్డ్ భూమి(Assigned Land) అక్రమార్కులకు వరంగా మారింది. పెద్ద మొత్తంలో భూ అన్యాక్రాంతానికి పాల్పడ్డ పెద్దలు వెసక రెవెన్యూ హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో ఇక్కడ తహశీల్దార్‌(Tahsildar)గా పనిచేసిన అధికారులు అసైన్డ్ భూములను బూచీగా చూపి భారీ మొత్తంలో దండుకున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అసైన్డ్, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల (Revenue Officers) హస్తం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విఆర్ ఓలు, గరంలో పనిచేసిన తహశీల్దార్లు భారీగా డబ్బులు దండుకోని విచ్చలవిడిగా రెవెన్యూ వికార్డులు మా ర్చి పట్టాల పర్వం కొనసాగించినట్లు తెలుస్తుంది. అతిపెద్ద సర్వే నంబర్ 817ను ఆసరా చేసుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది.

“భూ భారతి”లో కూడా ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

సర్వే నంబర్ 817లో కెబిపిఎస్ కర్మాగారంలో పనిచేసే ఓఏడీ స్థాయి ఇంజనీర్ భారీ కట్టడం చేపడుతున్నాడు. ఈయన బాటలోనే మరో ఇంజనీర్, మరి కొంతమంది నిర్మాణం చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరుఎత్తినట్లు వ్యవహరిస్తూ తమకు రావాల్సిన వాటా వస్తే చాలు అనుకోని కాసుల కోసం అశపడి ఎంతో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణు దారులు కట్టబెడుతున్నారని, కబ్జాచేసి ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని పట్టణప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత శాఖాధికారులు మామూళ్ల మత్తులోపడీ ప్రభుత్వ భూములను గాలికి వదిలేశారని, అందుకే సర్వేనెంబర్ 817లో ఉన్న కోట్ల విలువచేసే భూమిని దర్జాగా కబ్జాచేసుకోని అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులకు కట్టబెడతారా లేక అధికారులు స్వాధీనం చేసుకుంటారో లేదో వేచి చూడాలి.

నిర్మాణదారుల పత్రాలను పరిశీలిస్తాం: తహశీల్దార్ దారా ప్రసాద్

సర్వే నెంబర్ 817లో ప్రభుత్వ భూములను కబ్జావేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారన్న విషయంపై పాల్వంచ తహశీల్దార్ దారాప్రసాద్ను ఆదాబ్ హైదరాబాద్ వివరణ కోరగా నిర్మాణం చేపడుతున్న ఇంటి యజమానుల పత్రాలను పరిశీలించి ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూమిలోనా లేక ప్రయివేట్ భూమిలో ఉన్నాయో పరిశీలిస్తామని, పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామని ఆదాబ్‌కు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News