Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిMLA | ప్రభుత్వ యునాని వైద్యశాలను ఆకస్మిక తనిఖీ

MLA | ప్రభుత్వ యునాని వైద్యశాలను ఆకస్మిక తనిఖీ

  • ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మౌలాలి ప్రాంతంలోని ప్రభుత్వ యునాని వైద్యశాల – ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, డాక్టర్ సానియా ఫాతిమా, ఫార్మాసిస్ట్ దయానంద నుండి ఆసుపత్రి కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపల్ శానిటేషన్ అధికారులను తక్షణ చర్యలు తీసుకుని ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటును గుర్తు చేస్తూ, ప్రతి ప్రజా వైద్యశాలలో నాణ్యమైన సేవలు అందేలా కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే మర్రి తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జె.ఎ.సి వెంకన్న , ఉస్మాన్, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News