బ్యాడ్మింటన్ స్టార్ (Badminton Star) సైనా నెహ్వాల్(Saina Nehwal).. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు (100 Years) పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభను ఉద్దేశించి సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. RSS చేస్తున్న మహత్తర సేవా కార్యక్రమాల(Social Service)ను ప్రశంసించారు. క్రీడా (Sports) రంగంలో ఆరెస్సెస్ చేస్తున్న ప్రోత్సాహక కృషి వల్ల యువత తమ ప్రతిభను అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ (PM Modi) క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం గురించి కూడా ప్రస్తావించారు. తన కెరీర్ గురించిన అంశాలనూ పేర్కొన్నారు.
రాకేష్ జైన్ ఆరెస్సెస్ స్థాపన గురించి వివరించారు. మొదటి సర్సంఘచాలక్ డాక్టర్ కేశవ బాలిరాం హెడ్గేవార్ స్థాపించిన ఈ సంస్థ ఎందుకు ఏర్పడింది? దాని అవసరం ఏంటి? అనే విషయాలను ఆయన తెలిపారు. గత శతాబ్దం పాటు సంస్థ సాగించిన ప్రయాణం, దేశ నిర్మాణంలో ఆరెస్సెస్ ప్రేరణతో నడుస్తున్న వివిధ సంస్థల గురించి వెల్లడించారు.

ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల (Centenary Celebrations) (2025–26) సందర్భంగా విజయ దశమి నుంచి జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పారు. ‘ఘర్ ఘర్ సంపర్క్ అభియాన్’(ఇంటింటికి సంపర్క కార్యక్రమం)లో భాగంగా దేశవ్యాప్తంగా 80 వేలకు పైగా గ్రామాల్లో హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తామని ప్రకటించారు.
పంచ పరివర్తన (ఐదు మార్పులు) అనే అంశంపై మాట్లాడారు. అవి..
- సామాజిక సమరసత – సమాజంలో ఐక్యత
- కుటుంబ ప్రబోధన్ – కుటుంబ విలువల అవగాహన
- నాగరిక శిష్టాచార – పౌర నియమాలు, క్రమశిక్షణ
- పర్యావరణం – ప్రకృతి పరిరక్షణ
- స్వదేశీ – దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహం
ప్రతి ఒక్కరూ ఈ దేశనిర్మాణ కార్యక్రమాల్లో, ఆరెస్సెస్ భవిష్యత్తు కార్యకలాపాల్లో పాల్గొనాలని రాకేష్ జీ ఆహ్వానించారు. క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, కోచ్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
