Wednesday, February 11, 2026
HomeతెలంగాణYadadri | యాదాద్రి భక్తులకు మెరుగైన సేవలు

Yadadri | యాదాద్రి భక్తులకు మెరుగైన సేవలు

దర్శనాల్లో వృద్ధులకు, దివ్యాంగులకు తక్షణ సహాయం

యాదగిరిగుట్ట దేవస్థానం, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం వృద్ధులకు, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు (Special Arrangements) చేశారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించుటానికి, ఆలయ పరిధిలో వీల్‌చైర్లు(wheel Chairs), బ్యాటరీ వాహనాలు (Battery vehicles) అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల సమన్వయం కోసం దేవస్థానం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

- Advertisement -

అందులో సహాయ కార్యనిర్వాహణాధికారి (శానిటేషన్), ఆలయ పర్యవేక్షకులు, ఎస్‌.పీ‌.ఎఫ్‌. సిబ్బంది(ఆన్ డ్యూటీ)తోపాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉంటారు. ఈ బృందం ప్రధాన గోపురం, మహాద్వారం, ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో విధులు నిర్వహించి, వృద్ధులు, దివ్యాంగులకు తక్షణ సహాయం అందిస్తారు. ముఖ్యంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో ఈ సేవలు మరింత సమర్థంగా అందుతాయి. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించటమే లక్ష్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.

రికార్డు స్థాయిలో నిత్యాదాయం

కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో నిత్యాదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. దేవస్థానంలోని వివిద విభాగాల ద్వారా స్వామి వారికి కోటి రూపాయలకు పైగా (1,00,57,322) ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం ఇటీవల కాలంలో నమోదైన అత్యధిక ఆదాయాల్లో ఒకటిగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News