Saturday, March 28, 2026
Homeఖమ్మంNaveen Yadav | సీఎం రేవంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Naveen Yadav | సీఎం రేవంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు

కార్యక్రమంలో పాల్గొన్న వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birth Day Wishes) తెలిపారు. ‘తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన ప్రజా నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న ముందుచూపున్న నేత సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్‌లో నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి కేక్ కట్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా.. వైరా ఎమ్మెల్యే (Wyra Mla) రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే (Sattupalli Mla) మట్టా రాఘమయి దయానంద్, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌లోని సేవా ప్రేరణ, నాయకత్వ దృక్పథం, ప్రజల పట్ల ఉన్న అనురాగాన్ని వెల్లడించారు. తెలంగాణకు తెలివైన నాయకత్వం ఇచ్చిన రెవంత్ రెడ్డి దీర్ఘాయుష్మంతుడై రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News