హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తి సమకూర్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కొన్ని షరతులు (Conditions) విధించడంతో వాటిని అధిగమించేందుకు ఎల్ అండ్ టీ (L and T) సంస్థ ఇచ్చిన ఆప్షన్ల (Options) మేరకు ప్రభుత్వం మెట్రోను పూర్తిగా కొనుగోలు చేసే నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో ప్రాజెక్ట్‌ను సుమారు రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, తద్వారా భవిష్యత్తులో విస్తరణ పనులు సులభమవుతాయని చెప్పారు. కేంద్రం గ్యారెంటీతో జైకా లేదా వరల్డ్ బ్యాంక్ (World Bank) వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా కేవలం 1–2% వడ్డీతో దీర్ఘకాల రుణాలు (Loans) పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇది ప్రజలపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందని సీఎం పేర్కొన్నారు.
