అందుబాటులో 3 వేలకు పైగా ఉద్యోగాలు
సింగరేణి (Singareni) సౌజన్యంతో ఈ నెల 12న కొత్తగూడెం క్లబ్(Kothagudem Club)లో మెగా జాబ్ మేళా (Mega Job Mela) నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Mla Kunamneni Sambashiva Rao) చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వస్తారని పేర్కొన్నారు. జాబ్ మేళాకి 50కి పైగా కంపెనీలు (Companies) హాజరవుతాయి. జిల్లా నలుమూలల నుంచి 10 వేల మందికి పైగా యువతీ యువకులు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 3 వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. కనీసం 10వ తరగతి నుంచి అన్ని రకాల విద్యార్హతలు కలిగినవారు పాల్గొనొచ్చు. నెలకు కనీసం రూ.13 వేలు మొదలుకొని రూ.10 లక్షల వరకు శాలరీ ప్యాకేజ్ ఇస్తారు. జాబ్‌మేళాకు హాజరయ్యేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక్కో అభ్యర్థి కనీసం 5 కంపెనీల ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
