Friday, March 27, 2026
HomeరాజకీయంRamchanderRao | అందరి చూపు బీజేపీ వైపు

RamchanderRao | అందరి చూపు బీజేపీ వైపు

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

దేశంలోని బడుగు బలహీన వర్గాలతో పాటు యువత (Youth) భారతీయ జనతా పార్టీ (Bjp) వైపు చూస్తున్నారని, పెద్దఎత్తున బిజెపిలో చేరుతున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (Telangana State President) ఎన్. రాంచందర్ రావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభావితమై ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దేశంలో ఒక అవినీతి రహితమైన (Corruption Free) ప్రభుత్వాన్ని దేశ ప్రజలకు అందించిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సారథ్యంలో దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు.

- Advertisement -

వికసిత భారత్‌(Viksit Bharat)గా, ఒక ఆత్మనిర్భర భారత్‌(Atmanirbhar Bharat)గా ఈరోజు భారత్ దూసుకుపోతుందంటే మోదీ కారణమన్నారు. అందుకే ప్రజలందరూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యక్రమం లో BRS, కాంగ్రెస్ కు చెందిన వెంకటపాటి రాజన్న, నాగేశ్వర్ రావు గొల్లపల్లు, నర్సింగ్ రావు G శివ కుమార్, కరణ్ దేవ్ లకు బిజెపిలోకి ఆయన సాదర స్వాగతం పలికారు. అంతేకాదు అందరు యువకులు, మహిళలు, విద్యావంతులు బీజేపీలో చేరాలని ఆహ్వానం పలికారు.

అందరి సహకారంతో తెలంగాణ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుదాం అని రాoచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు.. ఈ రోజు వనపర్తి జిల్లాలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మైనారిటీ సోదరులు కూడా బీజేపీలో చేరారు. అందరికి స్వాగతం పలకుతున్నాం. ఈ చేరికల ద్వారా తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నట్టు మరొసారి స్పష్టమవుతున్నది. నరేంద్ర మోదీ మంచి పాలన, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు.

బిజేపీ నాయకత్వం గత 12 సంవత్సరాలుగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి కారణంగా ప్రజలను అసంతృప్తి పరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, కమీషన్లపై మాత్రమే ఆధారపడింది. అవినీతి, బెదిరింపులు, మత రాజకీయాలు సమస్యలను పెంచుతున్నాయి. ప్రజలు ఇప్పుడు బిజేపీకి అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. యువకులు, మహిళలు, విద్యావంతులు బిజేపీలో చేరి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News