దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు ఏండ్లుగా మౌలిక వసతుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఇండ్ల నిర్మాణం పూర్తయినా, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, రోడ్లు, విద్యుత్, ఇంటి నంబర్లు లేని పరిస్థితి కొనసాగుతోంది. ఈ సమస్యలపై కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డిని కలసి గురువారం వినతిపత్రం అందజేశారు.
కమిషనర్ మాట్లాడుతూ, “కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. మూడు వారాల్లో ఇంటి నంబర్లు అందజేస్తాం. అన్ని మౌలిక వసతులు త్వరలో ఏర్పాటు చేస్తాం,” అని హామీ ఇచ్చారు. కమిషనర్ హామీతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కోల బాల్ రాజ్ యాదవ్, నాయకులు బోడ శ్రీనివాస్, రమేష్ గౌడ్, కాలనీ వాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
