దేవరకొండ (Devarakonda) మండలం మడమడక గ్రామంలో జట్టి దేవి (21) ప్రసవ వేదనకు గురై 108కు ఫోన్ చేసింది. చింతపల్లికి చెందిన 108 సిబ్బంది వెంటనే స్పందించారు. కానీ వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అకాల వర్షాల (Rains) కారణంగా మైనంపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో.. రోడ్డు మూసేశారు(Road Close).
ఈ పరిస్థితిలో చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు గర్భిణిని స్ట్రెచర్(Stretcher)పై వాగు దాటించారు. తర్వాత సురక్షితంగా (Safely) దేవరకొండ ఏరియా ఆసుపత్రి(Area Hospital)కి తరలించారు. గర్భిణి కుటుంబ సభ్యులు, స్థానికులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా(Nalgonda District)లోని చింతపల్లి అంబులెన్స్ (Ambulance) సిబ్బంది ధైర్యాన్ని ప్రదర్శించడంలో, సేవ చేయటంలో తమకుతామే సాటి అని మరోసారి నిరూపించారు.
