హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక జీవన శైలి (Life Style) వల్ల చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో వెన్నెముక (spine) సమస్యలు క్రమంగా పెరిగిపోతున్నాయని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) ఆర్థోపెడిక్ విభాగం స్పైయిన్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ తాటి, డాక్టర్ కల్యాణ్, కుమార్ వర్మ అన్నారు. పోలీసు స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వరంలో సిబ్బంది కొరకు వెన్నెముక సంరక్షణ అంశంపై అవగహన సదస్సు (Awareness Conference) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అధిక సమయం కంప్యూటర్ తెర ముందు కూర్చోవడం. శారీరక శ్రమ లేకపోవడం జీవనశైలిలో మార్పులు ద్విచక్రవాహనాలపై అధిక దూరం ప్రయాణం చేయడం ఒత్తిడిలో జీవితాన్ని గడిపేవారిలో వెన్నెముక సమస్యలు వస్తున్నాయని అధ్యాయనాల ద్వారా తెలుస్తోంది. అందుకే తక్కువగా కదలటం, ఎక్కువగా బాధపడటం జరుగుతుంది. అందుకు వెన్ను నొప్పిని తెలికగా తీసుకోవద్దు. ఒక రోజు కంటే అధికంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
వెన్నెముక వ్యాధికి వయసుతో పనిలేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా సమస్య రావొచ్చు. వెన్నెముక శస్త్రచికిత్సలో అత్యాధునిక వైద్య పద్దతులు ఉన్నాయి. కంప్యూటర్ న్యావిగేషన్ న్యూరో మానిటరింగ్, ఎండోస్కోపి కీహోల్ ఆపరేషన్‌లతో వెన్నెముక సమస్యలను చాల సులువుగా నయం చేస్తున్నారు. ఉద్యోగులు రోజుకి కనీసం అర గంట శారీరక శ్రమ చేయాలి. ఇది వెన్నెముకకు సురక్షితంగా ఉంచుతుందన్నారు. దాదాపు 170 మంది పాల్గొన్నారు.
