రైతు ప్రయోజనాల కోసం మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు కేంద్రాన్ని (Corn purchasing center) అందుబాటులోకి తెచ్చారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు(Khanapur Agricultural Market Yard)లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే (Mla) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) ప్రారంభించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం రూ.2400 మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేస్తుందని చెప్పారు. మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా రైతులు (Farmers) నేరుగా కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు.
