మంచిర్యాల (Mancherial) శాసన సభ్యుడు (Mla) కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు (Kokkirala Prem Sagar Rao) సంపూర్ణ ఆరోగ్యంగా (Healthy) ఉన్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు (Personal Assistant) తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమం(Social Media)లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులతో చర్చిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. శాసన సభ్యుడి ఆరోగ్యంపై కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫేక్ న్యూస్ (Fake News) నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ప్రేమ్‌సాగర్‌రావుకి సీరియస్(Serious)గా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వివరణ ఇచ్చారు.
